తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు

02-10-2021 Sat 21:15
  • గత 24 గంటల్లో 41,690 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,541 మందికి చికిత్స
Telangana covid media report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,690 కరోనా పరీక్షలు నిర్వహించగా, 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 23, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట, ములుగు, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 258 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,66,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,57,923 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,541 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,920కి పెరిగింది.