పెళ్లి ఓ జబ్బు... విడాకులే దానికి మందు: రాంగోపాల్ వర్మ

02-10-2021 Sat 20:18
  • ట్విట్టర్ లో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
  • పెళ్లిళ్లు నరకంలో జరుగుతాయని వెల్లడి
  • విడాకులు స్వర్గంలో జరుగుతాయని వివరణ
  • విడాకులప్పుడే భారీగా వేడుకలు చేసుకోవాలని సూచన
Ram Gopal Varma opines on marriage and divorce
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవాళ తన ట్విట్టర్ ఖాతాను పెళ్లి, విడాకుల అంశంపై వ్యాఖ్యలతో నింపేశారు. పెళ్లి ఒక జబ్బు అని, విడాకులే దానికి మందు అని సూత్రీకరించారు. పెళ్లిని బ్రిటీష్ పాలనతో పోల్చిన వర్మ... విడాకులను స్వాతంత్ర్యం అని పేర్కొన్నారు. హిట్లర్ యుద్ధాన్ని ప్రారంభించడాన్ని పెళ్లి అని భావిస్తే, గాంధీజీ స్వాతంత్ర్యం సాధించడాన్ని విడాకులు అని చెప్పుకోవచ్చని అభివర్ణించారు.

పెళ్లిళ్లు నరకంలో జరుగుతాయని, విడాకులు స్వర్గంలో జరుగుతాయని తెలిపారు. అందుకే పెళ్లి కంటే విడాకులు తీసుకున్నప్పుడే ఎక్కువగా వేడుకలు చేసుకోవాలని సూచించారు. సంగీత్ వంటి కార్యక్రమాలు చేసుకోవాల్సింది విడాకులు సమయంలోనే అని, విడిపోయిన స్త్రీ, పురుషులు ఆ సమయంలో హాయిగా ఆడిపాడాలని సెలవిచ్చారు.