ముంబయి ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ

02-10-2021 Sat 19:35
  • లో స్కోరింగ్ మ్యాచ్ లో ఢిల్లీ పైచేయి
  • మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 రన్స్
  • 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 132 రన్స్ చేసిన ఢిల్లీ
  • శ్రేయాస్అయ్యర్ 33 నాటౌట్
Delhi Capitals beat Mumbai Indians by four wickets
షార్జాలో ముంబయి ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 26, అశ్విన్ 20 నాటౌట్, హెట్మెయర్ 15 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, జయంత్, కృనాల్, బుమ్రా, కౌల్టర్ నైల్ తలో వికెట్ తీశారు.

ఇక, నేటి రెండో మ్యాచ్ అబుదాబిలో జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ పై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.