రజనీ కూతురు దర్శకత్వంలో భారీ తెలుగు సినిమా!

02-10-2021 Sat 18:49
  • తమిళంలో మెగా ఫోన్ పట్టిన అనుభవం
  • రెండు సినిమాలకి దర్శకత్వం
  • తెలుగు సినిమా కోసం రంగంలోకి
  • నిర్మాణ సంస్థగా లైకా    
Aishwarya Dhanush will direct telugu movies from now

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుశ్ కి మొదటి నుంచి కూడా దర్శకత్వం పైనే ఆసక్తి. అందువల్లనే ఆమె '3' సినిమాతో మెగాఫోన్ పట్టుకుంది. ఆ సినిమాలోని 'వై దిస్ కొలవరి' పాట అప్పట్లో ఎంతగా పాప్యులర్ అయిదనేది అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఆమె 'వెయ్ రాజా వెయ్' అనే సినిమాను కూడా తెరకెక్కించారు.

గౌతమ్ కార్తీక్ - ప్రియా ఆనంద్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ ఓ మాదిరిగా ఆడింది. మళ్లీ ఇప్పుడు ఐశ్వర్య ధనుశ్ మరో సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను ఆమె తెలుగులో రూపొందించనుండటం విశేషం .. ఆమె దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను చేయడానికి లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు రావడం మరో విశేషం.

ఐశ్వర్య ధనుశ్ దర్శకత్వంలో తెలుగులో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందనుందని లైకా ప్రొడక్షన్స్ వారు అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని అన్నారు. ఐశ్వర్య ధనుశ్ కి తెలుగు సినిమా చేయాలనే ముచ్చట ఎందుకు కలిగిందో ఏమో మరి.