ఒక వ్యక్తితో ఐదేళ్లకు పైగా రిలేషన్ షిప్ లో ఉన్నా: సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు

02-10-2021 Sat 18:32
  • స్కూల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నా
  • 21-22 వయసులో ఒక వ్యక్తితో సీరియస్ రిలేషన్ షిప్ కొనసాగించాను
  • వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయి
Sonakshi Sinha speaks about her relationship

బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా ముద్దుల తనయ సోనాక్షి సిన్హా 'దబాంగ్' సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పలు సనిమాల్లో నటించిన ఆమె నటిగా నిరూపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాన్ని బయట పెట్టారు. మీరెప్పుడైనా రిలేషన్ షిప్ లో ఉన్నారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్రకు బదులుగా ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చింది.

స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో తాను రిలేషన్ షిప్ లో ఉన్నానని.... అయితే అది అంత పెద్ద రిలేషన్ షిప్ కాదని సోనాక్షి తెలిపింది. తాను 21-22 వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్ ను కొనసాగించానని చెప్పింది. ఒక వ్యక్తితో ఐదేళ్లకు పైగా రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపింది. ప్రతి రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పింది. వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయని తెలిపింది. మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలని తెలిపింది.