భారీ యాక్షన్ సీన్స్ కోసం స్పెయిన్ కి వెళ్లిన 'సర్కారువారి పాట'

02-10-2021 Sat 18:03
  • వరుస విజయాలతో ఉన్న మహేశ్
  • 'సర్కారువారి పాట'పై భారీ అంచనాలు
  • ప్రతినాయకుడిగా సముద్రఖని
  • జనవరి 13వ తేదీన విడుదల    
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నాడు. అందువలన ఆయన తాజా చిత్రమైన 'సర్కారువారి పాట'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతవరకూ హైదరాబాద్ .. దుబాయ్ .. గోవాలలో ఈ సినిమా షూటింగుని జరుపుతూ వచ్చారు. తదుపరి షెడ్యూల్ ను 'స్పెయిన్' లో ప్లాన్ చేశారు. ఇప్పటికే మహేశ్ బాబుతో పాటు ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకుంది.

వచ్చేవారం నుంచి అక్కడ షూటింగు మొదలుకానుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను అక్కడ చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ నెల చివరివరకూ అక్కడే షూటింగు జరుగుతుందని అంటున్నారు. దాంతో 75 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని చెబుతున్నారు.

ఆ తరువాత హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ షూటింగును జరపుతారట. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా సముద్రఖని కనిపించనున్నాడు. 'సంక్రాంతి' పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.