ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇదే: రాజమౌళి

02-10-2021 Sat 18:03
  • వచ్చే ఏడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
  • కీలకపాత్రలో అజయ్ దేవగణ్
  • భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్
  • హీరోయిన్లుగా అలియా భట్, ఒలీవియా మోరిస్
Rajamouli announced RRR release date
భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో ప్రకటించారు. 07.01.2022... ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ఇదేనంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా రాజమౌళి పంచుకున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించగా.... అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ చిత్రం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే ఓసారి విడుదల వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ ఈసారి పక్కా అంటూ చిత్రబృందం పేర్కొంది.