అల్లు అర్జున్ తో మురుగదాస్ సైన్స్ ఫిక్షన్!

02-10-2021 Sat 17:33
  •  చివరిదశకు చేరుకున్న 'పుష్ప'
  • డిసెంబర్ 17వ తేదీన రిలీజ్
  • త్వరలో సెట్స్ పైకి 'ఐకాన్'
  • లైన్లో మరో పాన్ ఇండియా మూవీ
Allu Arjun in Murugadoss movie

ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను, డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత సినిమాగా అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు మురుగదాస్ ఇటీవల తరచూ అల్లు అర్జున్ ను కలుస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా నిర్మితం కానున్నట్టుగా చెప్పుకున్నారు. అది నిజమేననే టాక్ ఇప్పుడు మరింత బలపడుతోంది. మురుగదాస్ రెడీ చేసిన ఒక సైన్స్ ఫిక్షన్ లో అల్లు అర్జున్ చేయనున్నాడని అంటున్నారు.

ఈ సైన్స్ ఫిక్షన్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో నడుస్తుందని చెబుతున్నారు. అల్లు అర్జున్ 'ఐకాన్' పూర్తిచేసిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.