Sneha Jain: దక్షిణాది సినీ దర్శకుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: హీరోయిన్ స్నేహ జైన్

South director misbehaved with me says Sneha Jain
  • కెరీర్ ఆరంభంలో నేను వేధింపులు ఎదుర్కొన్నా
  • ఓ దర్శకుడు హైదరాబాదుకు రమ్మన్నాడు
  • ఒక రోజంతా గడపాలని అన్నాడు
సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పటికే ఎంతో మంది తమ అనుభవాలను వెల్లడించడం ద్వారా వాస్తవాలను బయటపెట్టారు. తాజాగా బాలీవుడ్ నటి స్నేహ జైన్ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టింది. కెరీర్ ఆరంభంలో తాను కూడా వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడు తనను వేధించాడని తెలిపింది.
 
కాలేజీ నేపథ్యంలో సాగే ఓ సినిమాలో తనకు అవకాశం ఇస్తానని దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ ఫోన్ చేశాడని స్నేహ చెప్పింది. దీంతో తన ఫొటోలు, వివరాలను ఆయనకు పంపించానని తెలిపింది. మరుసటి రోజు ఆయన ఫోన్ చేసి హైదరాబాదుకు రమ్మన్నాడని... ఒక రోజంతా తనతో గడపాలని, దేనికీ అభ్యంతరం చెప్పకూడదని అన్నాడని... అయితే అలాంటి పనులు తాను చేయనని చెప్పానని వెల్లడించింది.

మళ్లీ వారం తర్వాత ఆయన ఫోన్ చేశాడని... ఇప్పటికీ ఆఫర్ అలాగే ఉందని, నువ్వు ఓకే అంటే అవకాశం ఇస్తానని చెప్పాడని... అప్పుడు తాను కోపంలో గట్టిగా అరిచి ఫోన్ పెట్టేశానని చెప్పింది. ప్రస్తుతం 'సాత్ నిభానా సాథియా 2' చిత్రంలో స్నేహ నటిస్తోంది. అయితే, అతని పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు.
Sneha Jain
Bollywood
Tollywood
Casting Couch

More Telugu News