క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లి కోసం కన్యత్వాన్ని అమ్ముకునేందుకు సిద్ధమైన బాలిక

02-10-2021 Sat 17:03
  • నాగపూర్ లో ఘటన
  • 11 ఏళ్ల బాలికతో వ్యభిచారం చేయించే ప్రయత్నం
  • రూ.5 వేలకు కన్యత్వాన్ని ఖరీదుకట్టిన వైనం
  • బాలికను పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు
Minor girl set to sell her virginity for mother treatment

మహారాష్ట్రలో ఓ మైనర్ బాలిక క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లి కోసం తీవ్ర నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో నివసించే 11 ఏళ్ల బాలిక తల్లి క్యాన్సర్ బారినపడింది. తల్లికి చికిత్సకు డబ్బు లేకపోవడంతో ఆ బాలిక తన కన్యత్వాన్ని రూ.5 వేలకు అమ్ముకునేందుకు సిద్ధమైంది. అయితే ఓ అపార్ట్ మెంట్ లో ఆ బాలికతో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రంగంలోకి దిగి ఆ బాలికను రక్షించారు.

ఈ ఘటనలో పోలీసులు అర్చన వైశంపాయన, రంజనా మిశ్రా, కవితా నిఖారే అనే ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురు మహిళలు బాలికతో వ్యభిచారం అంటూ ఓ విటుడితో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నట్టు గుర్తించారు. అరెస్టయిన వారిలో ఒకరైన అర్చనా వైశంపాయన, మైనర్ బాలిక తల్లి పరిచయస్తులని, అర్చన రెండేళ్ల కొడుకును ఆడించేందుకు బాలికను ఆమె తల్లే అర్చన ఇంటికి పంపేదని పోలీసులు తెలిపారు. అయితే, ఆ బాలిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు కోసం ఆమె కన్యత్వాన్ని అర్చన తదితరులు అమ్మకానికి పెట్టారని పోలీసులు వెల్లడించారు.

తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని చెప్పి ఆ బాలికను అర్చన వైశంపాయన వ్యభిచారం నిమిత్తం ఓ అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లిందని, అయితే వారు మాట్లాడుకున్న విటుడే ఇన్ఫార్మర్ గా మారి సమాచారం అందించినట్టు పోలీసులు వివరించారు. కాగా, ఆ బాలికను పోలీసులు ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు.