కష్టాల్లో ముంబై జట్టు.. ప్లేఆఫ్ చేరాలంటే ఏం చేయాలంటే..!

02-10-2021 Sat 17:02
  • మిగతా మూడు మ్యాచులు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి 
  • చివరి ఐదు మ్యాచుల్లో మూడే విజయాలు 
  • ఫామ్ లేమితో బాధపడుతున్న స్టార్ ప్లేయర్లు 
How can Mumbai Indians qualify for IPL 2021 playoffs

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు కష్టాల్లో ఉంది. ఈసారి కనీసం ప్లేఆఫ్స్ అయినా చేరుతుందా? అని సగటు అభిమాని ఆందోళన చెందాల్సిన స్థితిలో ఉందీ జట్టు. ఈ జట్టు ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి పడిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలి ఉన్న మూడు మ్యాచులను కచ్చితంగా గెలవాలి. వాటిలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ ఒకటి. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిందంటే మిగతా రెండు మ్యాచులను భారీ తేడాతో గెలవాలి.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యథిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఇలా కష్టాల్లో పడటం అభిమానులకు మింగుడు పడటం లేదు. ఏదేమైనా ఈ జట్టు గౌరవం నిలుపుకోవాలన్నా సరే మిగతా మ్యాచుల్లో మంచి ప్రదర్శనతో విజయాలు నమోదు చేయాలి. మరి చూద్దాం.. రోహిత్ సేన ఏం చేస్తుందో.