ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... ముంబయిపై టాస్ నెగ్గిన ఢిల్లీ

02-10-2021 Sat 16:32
  • బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 12 ఓవర్లలో ముంబయి స్కోరు 76-3
  • నిరాశపరిచిన రోహిత్ శర్మ
  • మరో మ్యాచ్ లో చెన్నై వర్సెస్ రాజస్థాన్
Delhi Capitals won the toss against Mumbai Indians

ఐపీఎల్ లో వారాంతం సందర్భంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుండగా, రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ముంబయిపై టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పోరు కోసం ఢిల్లీ జట్టులో ఒక మార్పు జరిగింది. లలిత్ యాదవ్ ను తప్పించి పృథ్వీ షాను తుదిజట్టులోకి తీసుకున్నారు. ముంబయి జట్టులో రాహుల్ చహర్ స్థానంలో జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.

కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టు 12 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 19 పరుగులు చేసి అక్షర్ బౌలింగులో నోర్జేకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశాడు. ఈ వికెట్ కూడా అక్షర్ కే దక్కింది. ప్రస్తుతం క్రీజులో సౌరభ్ తివారీ 14, కీరన్ పొలార్డ్ 1 పరుగులతో ఆడుతున్నారు.