Navjot Singh Sidhu: పదవి ఉన్నా, లేకపోయినా రాహుల్, ప్రియాంకల వెన్నంటే ఉంటా: నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Navjyot Singh Sidhu stated that he will stand with Rahul and Priynaka
  • పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
  • పీసీసీకి ఇటీవల రాజీనామా చేసిన సిద్ధూ
  • నిన్న సీఎంతో భేటీ
  • సిద్ధూనే పీసీసీ చీఫ్ గా కొనసాగుతాడంటున్న కాంగ్రెస్ వర్గాలు

ఇటీవల అనూహ్యరీతిలో పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. తాజాగా సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై తన విధేయత వెల్లడయ్యేలా స్పందించారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళతానని తెలిపారు. తాను పదవిలో ఉన్నా, లేకపోయినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల వెన్నంటే ఉంటానని స్పష్టం చేశారు.

"ప్రతికూల శక్తులన్నీ ఏకమై నన్ను ఓడించేందుకు ప్రయత్నించనివ్వండి. కానీ పాజిటివ్ ఎనర్జీలోని ప్రతి అణువు ఉప్పొంగి పంజాబ్ ను గెలిపిస్తుంది, పంజాబీయాత్ (విశ్వ సోదరభావం)ను నిలుపుతుంది, ప్రతి పంజాబీని విజయం వరిస్తుంది" అంటూ సిద్ధూ ట్వీట్ చేశారు.

ఇటీవల కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయగా, కాంగ్రెస్ హైకమాండ్ చరణ్ జిత్ చన్నీని సీఎంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత సిద్ధూ పీసీసీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. అయితే, నిన్న సిద్ధూ సీఎం చరణ్ జిత్ చన్నీతో భేటీ అయిన తర్వాత సమస్య పరిష్కారం అయినట్టు భావిస్తున్నారు. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News