ఆర్టిస్టులందరికీ సినీ అవకాశాలు.. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన 'మా' అభ్యర్థి సీవీఎల్

02-10-2021 Sat 13:04
  • అధ్యక్ష బరిలో నిలిచిన నటుడు
  • మా సభ్యులందరికీ 3 లక్షల బీమా
  • వృద్ధ కళాకారుల పింఛన్ రూ.10 వేలకు పెంపు
CVL Narsimha Rao Announces MAA Manifesto

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రధాన అభ్యర్థులంతా నామినేషన్లను సమర్పించారు. అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర్సింహారావులు నామినేషన్లను దాఖలు చేశారు. తాజాగా సీవీఎల్ గెలిస్తే ఏం చేస్తానో చెబుతూ మేనిఫెస్టోను విడుదల చేశారు. రెండు రోజుల్లో మీడియాతో అన్ని విషయాలూ మాట్లాడుతానన్నారు.

మేనిఫెస్టోలో పేర్కొన్నవి ఇవీ..

  • మా సభ్యులందరికీ ఏటా రూ.3 లక్షల బీమా. వచ్చే ఏడాది జనవరి నుంచి అమలయ్యేలా చర్యలు.
  • 20 ఏళ్ల క్రితం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పున:ప్రారంభం. ఆ కమిటీలో ఉండే 13 పేర్లు త్వరలోనే ప్రకటన.
  • ఆర్టిస్టులందరికీ అవకాశాలు వచ్చేలా చూడడం. 2011లో తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా చర్యలు. అందుకు 50 మందితో కమిటీ. త్వరలోనే కమిటీ సభ్యుల ప్రకటన.
  • ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో ‘మా’ సభ్యులకు అసోసియేట్ మెంబర్ షిప్.
  • వృద్ధ కళాకారులకు ఇప్పుడిస్తున్న పింఛను రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. నవంబర్ నుంచే అమలు చేసేందుకు చర్యలు
  • ఆకలి బాధలు పడే ‘మా’ సభ్యులు.. ఫోన్ చేస్తే రెండు గంటల్లోనే నెలకు సరిపడా వంట సామగ్రి అందజేత.