ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను: హీరో సిద్ధార్థ్

02-10-2021 Sat 12:43
  • షూటింగులో గాయపడిన సిద్ధార్థ్ 
  • లండన్ లోని ఆసుపత్రిలో సర్జరీ
  • ఇండియాకు తిరిగొచ్చానని వెల్లడించిన సిద్ధార్థ్
I am recovering says Siddharth
సినీ నటుడు సిద్ధార్థ్ లండన్ లోని ఆసుపత్రిలో చిన్న సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ సక్సెస్ అయిందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. 'మహా సముద్రం' సినిమా షూటింగ్ సందర్భంగా స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు గాయపడ్డానని... దీంతో సర్జరీ చేయించుకున్నానని చెప్పారు. తాను ఇండియాకు తిరిగి వచ్చేశానని తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాదులో 'మహా సముద్రం' సినిమాకు డబ్బింగ్ చెపుతున్నానని తెలిపారు. సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నానని అన్నారు. డాక్టర్లు కొంతకాలం రెస్ట్ తీసుకోమని సూచించారని తెలిపారు. అక్టోబర్ 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ఏకే ఎంటర్టైన్ మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.