చరణ్ సినిమాలో శ్రీకాంత్ పవర్ఫుల్ రోల్!

02-10-2021 Sat 11:48
  • నా పాత్ర కొత్తగా ఉంటుంది
  • శంకర్ గొప్పగా డిజైన్ చేశాడు  
  • డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాను
  • నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుంది
shankar and Charan movie update

హీరోగా శ్రీకాంత్ ఒక రేంజ్ లో దూసుకుపోయాడు. చాలా తక్కువ సమయంలోనే 100 సినిమాను పూర్తి చేశాడు. కొత్త తరం హీరోల జోరు పెరుగుతూ ఉండటంతో, కీలకమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. 'ఇదే మా కథ' సినిమా చేసిన ఆయన, త్వరలో 'అఖండ' సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్, తెరపై ఒక కొత్త శ్రీకాంత్ ను చూస్తారని చెబుతున్నాడు. ఇదే సమయంలో ఆయన శంకర్ తో చరణ్ చేయనున్న సినిమాను గురించి కూడా ప్రస్తావించాడు.

"శంకర్ సినిమాలో నాకు వైవిధ్యభరితమైన పాత్ర లభించింది. యంగ్ లుక్ లోను .. ఓల్డ్ లుక్ తోను కనిపిస్తాను. ఈ సినిమాలో నా పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. లుక్ పరంగా ఎంత కొత్తగా ఉంటుందో.. చేతల పరంగా అంత పవర్ఫుల్ గా ఉంటుంది. నా కెరియర్లోనే ఇది ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.