'వరుడు కావలెను' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

02-10-2021 Sat 11:06
  • నాగశౌర్య జోడీగా రీతూ వర్మ
  • ప్రేమ - పెళ్లి చుట్టూ తిరిగే కథ 
  • ఈ నెల 15వ తేదీన విడుదల
Varudu Kaavalenu lyrical video released

నాగశౌర్య - రీతూ వర్మ జంటగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను పలకరించనుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను, అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు .. వయ్యారం చిందేసే అందాల బొమ్మలు' అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ సంగీతం .. రఘురామ్ సాహిత్యం .. గీతా మాధురి బృందం ఆలాపన ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఒక పెళ్లి వేడుకలో మిగతా కుర్రాళ్లు .. అమ్మాయిలు కలిసి ఒకరిని ఒకరు కవ్విస్తూ పాడుకునే పాట ఇది. పాట కోసం చాలా ఖర్చుపెట్టారనీ .. కలర్ ఫుల్ గా చిత్రీకరించారనే విషయం అర్థమవుతోంది. ప్రేమ - పెళ్లి అనే బలమైన అంశాలు చుట్టూ తిరిగే ఈ కథ, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.