Sharmila: తెలంగాణను దోపిడీ, దొంగల తెలంగాణగా మారుస్తున్నారు: ష‌ర్మిల

  • మంజీరా న‌దిలో య‌థేచ్ఛ‌గా ఇసుక మాఫియా
  • సామాన్య జ‌నం ఇసుక రవాణాను అడ్డుకుంటే వారిపై కేసులు
  • ద‌ళితుల ప్రాణాలంటే కేసీఆర్‌కు లెక్క‌లేదు
  • ఇసుక దందా వెన‌క ఎవ‌రెవ‌రు ఉన్నారు?  
sharmila slams kcr

తెలంగాణ ప్ర‌భుత్వంపై వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. ఇసుక మాఫియాను అరిక‌ట్ట‌కుండా సామాన్య ప్ర‌జ‌లపై ప్ర‌భుత్వం ప్ర‌తాపం చూపుతోంద‌ని ఆమె ఆరోపించారు.

'జుక్క‌ల్ నియోజ‌క‌వర్గంలోని మంజీరా న‌దిలో య‌థేచ్ఛ‌గా ఇసుక మాఫియా సాగుతోంది. సామాన్య జ‌నం ఇసుక రవాణాను అడ్డుకుంటే వారిపై పీడీ యాక్టు, రౌడీ షీట్ ఓపెన్ చేసి జైళ్ల‌లో పెడుతున్నారు. బంగారు తెలంగాణను దోపిడీ, దొంగల తెలంగాణగా మారుస్తున్నారు' అని ష‌ర్మిల ఆరోపించారు.

'ద‌ళితుల ప్రాణాలంటే కేసీఆర్‌కు లెక్క‌లేదు. ఇసుక మాఫియాపై వెంట‌నే సిట్టింగ్‌ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి. ఇసుక దందా వెన‌క ఎవ‌రెవ‌రు ఉన్నారు? ఎవ‌రికి ఎంత వాటా వెళ్తుంది? దోషులెవ‌రో తేల్చాలి' అని ష‌ర్మిల డిమాండ్ చేశారు.

More Telugu News