సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

02-10-2021 Sat 07:41
  • 'భోళా శంకర్'కి జోడీగా తమన్నా 
  • స్పెయిన్ వెళ్లిన మహేశ్ బాబు 
  • ఓటీటీ ద్వారా సమంత సినిమా   
Tamanna to pair up with Chiranjeevi in Bhola Shankar

*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందే 'భోళాశంకర్' చిత్రంలో కథానాయిక పాత్రకు తమన్నా ఖరారైనట్టు తాజా సమాచారం. ఇందులో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేశ్ నటించనుంది. తమిళంలో వచ్చిన 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా దీనిని రూపొందిస్తున్నారు.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రం షూటింగ్ వచ్చే వారం నుంచి స్పెయిన్ లో జరుగుతుంది. ఇందుకోసం మహేశ్ ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఈ నెలాఖరు వరకు షూటింగ్ నిర్వహిస్తారని సమాచారం. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
*  సమంత, నయనతార కలసి 'కాట్టు వాకుల రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. కాగా, ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా, డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్టు రిలీజ్ చేయడానికి హక్కులను విక్రయించినట్టు సమాచారం. దీపావళికి దీనిని స్ట్రీమింగ్ చేస్తారు.