ఐపీఎల్ లో నేడు పంజాబ్ వర్సెస్ కోల్ కతా.. ఆరంభంలోనే గిల్ అవుట్

01-10-2021 Fri 20:07
  • టాస్ గెలిచిన పంజాబ్
  • బౌలింగ్ ఎంచుకున్న వైనం
  • గిల్ ను అవుట్ చేసిన అర్షదీప్
  • వెంకటేశ్ అయ్యర్ దూకుడు
Punjab Kings plays against Kolkata Knight Riders

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ షురూ అయింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బయోబబుల్ ఒత్తిడి తట్టుకోలేక స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ వెళ్లిపోవడంతో పంజాబ్ జట్టులో అతడి స్థానంలో ఫాబియెన్ అలెన్ కు చోటిచ్చారు.

అలాగే మన్ దీప్ స్థానంలో మయాంక్ అగర్వాల్, హర్ ప్రీత్ బ్రార్ స్థానంలో షారుఖ్ ఖాన్ తుదిజట్టులోకి వచ్చారు. ఇక కోల్ కతా జట్టులోనూ మార్పులు జరిగాయి. లాకీ ఫెర్గుసన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్, సందీప్ వారియర్ స్థానంలో శివం మావి ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు.

కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టు ఆరంభంలోనే ఓపెనర్ శుభ్ మాన్ గిల్ వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన గిల్ అర్షదీప్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం కోల్ కతా స్కోరు 7 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 55 పరుగులు కాగా, ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 33 పరుగులతోనూ, రాహుల్ త్రిపాఠి 13 పరుగులతోనూ ఆడుతున్నారు.