Sachin Tendulkar: హీరోలా వచ్చిన ఇషాన్ కిషన్.. సడెన్‌గా సచిన్‌ను చూసి ఎలా అయిపోయాడో చూడండి!

Ishan Krishan reaction after watching Sachin in dressing room
  • బుద్ధిమంతుడిలా గ్లాసెస్ తీసి తల దువ్వుకున్న యువప్లేయర్ 
  • ఎంతో గౌరవంగా గుడ్ మార్నింగ్ సర్ అంటూ విష్ 
  • నవ్వాపుకోలేకపోయిన కీరన్ పొలార్డ్ సహా జట్టు సభ్యులు
సచిన్ అంటే యువ క్రికెటర్లందరికీ గౌరవమే. ఆయన ముందు చాలా బుద్ధిగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటీవల ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఘటన ఈ మాటలకు అద్దం పడుతుంది.

కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, చెవిలో ఇయర్ బడ్స్‌తో మ్యూజిక్ వింటూ దర్జాగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువప్లేయర్ ఇషాన్ కిషన్.. అక్కడ సచిన్ ఉండటాన్ని చూసి తత్తరపడిపోయాడు. వెంటనే కళ్లజోడు తీసేసి, ఇయర్ బడ్స్ కూడా చెవుల్లోంచి తీసేశాడు. జుట్టును చేత్తో పక్కకు సరిచేసుకుంటూ ‘గుడ్ మార్నింగ్ సర్’ అంటూ విష్ చేశాడు.

సచిన్ ముందు అతను చూపిస్తున్న వినయాన్ని చూసిన సహచర ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. ముఖ్యంగా విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ అయితే పెద్దగానే నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఒకసారి చూసేసి నవ్వుకోండి మరి.
Sachin Tendulkar
IPL 2020
ishan kishan
mumbai indians

More Telugu News