ఏపీలో కొత్తగా 809 మందికి కరోనా పాజిటివ్

01-10-2021 Fri 18:40
  • గత 24 గంటల్లో 56,463 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరిలో 161 కేసులు
  • విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు
  • రాష్ట్రంలో 10 మంది మృతి
  • ఇంకా 11,142 మందికి చికిత్స
AP Corona virus situations update
ఏపీలో గడచిన 24 గంటల్లో 1000కి దిగున కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 809 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 161 కరోనా కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 153, నెల్లూరు జిల్లాలో 115 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదైంది.

అదే సమయంలో 1,160 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 14,186 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో నేటివరకు 20,51,133 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,25,805 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,142 మంది చికిత్స పొందుతున్నారు.