Allu Arjun: వచ్చే ఏడాదిలోనే రానున్న 'పుష్ప'

Pushpa movie update
  • షూటింగు చివరి దశలో 'పుష్ప'
  • ఆటంకాల కారణంగా షూటింగ్ ఆలస్యం
  • క్రిస్మస్ కి విడుదల కానట్టే 
  • వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసే ఛాన్స్
అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ అల్లుకున్న కథతో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఫస్టు పార్టు షూటింగును 90 శాతం వరకూ పూర్తిచేశారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమా షూటింగు అనుకున్నట్టుగా జరిగితే 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. డిసెంబర్ 17న గానీ .. 24వ తేదీన గాని ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెప్పుకున్నారు. కానీ కొన్నాళ్లపాటు కరోనా .. మరికొంతకాలం పాటు వర్షాల కారణంగా షూటింగుకు అంతరాయం కలిగింది. దాంతో ఈ సినిమాను క్రిస్మస్ కి విడుదల చేయడం లేదనే టాక్ వచ్చింది.

24వ తేదీన 'ఆచార్య' రావచ్చనే టాక్ అందుకు బలాన్ని చేకూర్చుతోంది. 'పుష్ప' వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ - రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు.
Allu Arjun
Pooja Hegde
Devisri Prasad

More Telugu News