ఆరు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ

01-10-2021 Fri 17:58
  • ఈరోజు వాడివేడిగా కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు
  • తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం
  • తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం
Six bills passed in TS Assembly
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు వాడివేడిగా కొనసాగాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగాయి. మరోవైపు ఈరోజు ఎనిమిది బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి.

ఆమోదం పొందిన బిల్లులు ఇవే:
  • తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021
  • తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021
  • తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021
  • కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శిటీ సవరణ బిల్లు
  • ది నేషనల్ అకాడెమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసర్చ్ యూనివర్శిటీ బిల్లు
  • తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు