పవన్ ఆలోచనా విధానం చాలా ప్రమాదకరంగా ఉంది: ఆదిమూలపు సురేశ్

01-10-2021 Fri 17:41
  • మొత్తం రాష్ట్రానికే గుదిబండలా మారారు
  • కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారు
  • పవన్ తీరును ప్రజలంతా గమనించాలి
Pawan Kalyan became dangerous to state says Adimulapu Suresh

  ఆన్ లైన్లో టికెట్లను అమ్మడం వల్ల సినీ పరిశ్రమకు లాభమని సినీ పెద్దలే స్వయంగా చెపుతున్నారని... ఆన్ లైన్ టికెటింగ్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ వారికే నచ్చడం లేదని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. సినీ పరిశ్రమ మొత్తం ఒక క్లారిటీతో ఉంటే... పవన్ మధ్యలో వెళ్లి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా మొత్తం రాష్ట్రానికే గుదిబండగా మారారని

ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్... కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తుండటం దారుణమని అన్నారు. ఎవరి కోసం పోరాడుతున్నారో, ఏ అజెండాతో ముందుకు వెళ్తున్నారో పవనే అర్థం చేసుకోవాలని చెప్పారు. ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఆలోచనతో పవన్ వ్యవహరిస్తుంటారని దుయ్యబట్టారు. ఆయన వాడుతున్న భాష, ఆలోచనా విధానం ప్రమాదకరంగా వున్నాయని చెప్పారు. పవన్ తీరును ప్రజలంతా గమనించాలని అన్నారు.