'పెళ్లి సందD' రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల!

01-10-2021 Fri 17:32
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'పెళ్లి సందD'
  • కీరవాణి పాటలకు మంచి రెస్పాన్స్
  • ముఖ్యమైన పాత్రలో రాఘవేంద్రరావు
  • అక్టోబర్ 15వ తేదీన విడుదల
Pelli SandaD release date confirmed
రోషన్ కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో 'పెళ్లి సందD' సినిమా రూపొందింది. ఆర్కే ఫిలిమ్స్ .. ఆర్కా మీడియా వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో శ్రీలీల తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో దసరాకి భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు.

ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా, సాహిత్యాన్ని చంద్రబోస్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాత పెళ్లి సందడిని గుర్తుకు చేస్తుందనే టాక్ అయితే బలంగానే వినిపిస్తోంది. మరి ఆ స్థాయిని మించిన విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందేమో చూడాలి.