GST: మరోసారి లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

  • వరుసగా మూడో నెల లక్ష కోట్లకు పైగా జీఎస్టీ
  • సెప్టెంబరు జీఎస్టీ వివరాలు వెల్లడించిన కేంద్రం
  • రూ.1,17,010 కోట్ల జీఎస్టీ వసూలు
  • అందులో కేంద్ర జీఎస్టీ రూ.20,578 కోట్లు 
  • రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.26,767 కోట్లు.
GST collection once again crossed one lakh crore mark

సెప్టెంబరు మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా మూడో నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటాయి. జులైలో రూ.1.16 లక్షల కోట్లు, ఆగస్టులో రూ.1.12 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. సెప్టెంబరులో జీఎస్టీ రూపేణా రూ.1,17,010 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది. గతేడాది ఇదే నెలలో రూ.95,480 కోట్ల జీఎస్టీ వసూలైంది. 2020తో పోల్చితే ఈసారి సెప్టెంబరు మాసంలో 23 శాతం వృద్ధి కనిపించింది.

తాజా జీఎస్టీ వసూళ్లలో కేంద్ర జీఎస్టీ వసూళ్లు రూ.20,578 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.26,767 కోట్లు. సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.60,911 కోట్లు కాగా, సెస్ రూపంలో రూ.8,754 కోట్లు వసూలైనట్టు ఆర్థికశాఖ వివరించింది.

More Telugu News