Karnataka: మహిళా రైతుతో దురుసుగా ప్రవర్తించిన మహిళా ఎస్‌ఐ

  • విత్తనాల కోసం వచ్చిన రైతును తోసేసిన వైనం 
  • కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగిన ఘటన 
  • మహిళా ఎస్‌ఐ తీరును తప్పుబడుతున్న నెటిజన్లు
Women SI throws women farmer on the ground

అధికారం ఉంది కదా అనే అహంకారంతో ఒక మహిళా ఎస్‌ఐ హద్దుమీరి ప్రవర్తించింది. విత్తనాల కోసం వచ్చిన మహిళా రైతుతో దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అనేకమంది ఇక్కడకు చేరుకున్నారు.

వీరంతా విత్తనాల కోసం వచ్చిన రైతులే. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళా రైతులు కూడా క్యూలో నిలబడ్డారు. ఈ సందర్భంగా కొంత తోపులాట కూడా జరిగింది. దీంతో ఇక్కడ బందోబస్తు డ్యూటీలో ఉన్న గంగమ్మ అనే ఎస్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళను కిందకు తోసేసి చేయిచేసుకుంది.

దీంతో గంగమ్మ తీరుపై మహిళా రైతులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జికి దిగారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని జిల్లా  కలెక్టర్ ఎస్పీ వేదమూర్తి హామీ ఇచ్చారు.

More Telugu News