Natti Kumar: ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ రాసిన లేఖపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

  • ఎవరితోనూ చర్చించకుండానే ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది
  • కేవలం ప్రెసిడెంట్, కార్యదర్శి మాత్రమే లేఖను పంపించారు
  • పోసాని ఇంటిపై పవన్ ఫ్యాన్స్ దాడిని ఖండిస్తున్నా
Natti Kumar response on film chambers letter to AP government

జనసేనాని పవన్ కల్యాణ్, నటుడు పోసాని వివాదంపై సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోసాని ఇంటిపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. నాయకులకు మంచి పేరు తెచ్చేలా అభిమానులు ప్రవర్తించాలని హితవు పలికారు.

ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ టికెట్ పోర్టల్స్ ప్రేక్షకుల నుంచి ఎక్కువ ధర వసూలు చేస్తున్నా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. కొందరు నిర్మాతలు పవన్ కల్యాణ్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. పవన్ పెద్ద స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే సినీ పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు.

ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ నుంచి వెళ్లిన లేఖపై ఎవరితోనూ చర్చించలేదని... కేవలం ప్రెసిడెంట్, కార్యదర్శి మాత్రమే లేఖను పంపించారని నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సమావేశం జరిగినా కేవలం ఆరుగురు నిర్మాతలు మాత్రమే వెళ్తున్నారని... చిన్న నిర్మాతలను సమావేశాలకు ఎందుకు పిలవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ అందరినీ సమానంగా చూస్తారని చెప్పారు.

More Telugu News