India: టాటా మోటార్స్‌లో ఉపాధ్యక్షుడిగా చేరిన ఫోర్డ్ ఇండియా మాజీ అధ్యక్షుడు

Former President Of Ford India Anurag Mehrotra Joins Tata Motors
షార్ట్స్‌లో చూడండి
ఫోర్డ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్ మెహ్రోత్రా కొత్త ఉద్యోగంలో చేరారు. టాటా మోటార్స్‌ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారు. ఆయన శుక్రవారం నుంచి ఈ కొత్త పదవిలో కొనసాగుతారని టాటా మోటార్స్ సంస్థ ఉద్యోగులకు పంపిన కమ్యూనికేషన్‌లో పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్డ్ కార్ల కంపెనీ భారతీయ విభాగంలో గడిచిన పదేళ్లుగా అనురాగ్ పనిచేస్తున్నారు.  

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే భారత్‌లో తమ కార్ల తయారీని నిలిపివేస్తామని ఫోర్డ్ ఇటీవల ప్రకటించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అనురాగ్ ఆ కంపెనీని వీడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత భారతీయ మార్కెట్లో కార్లు తయారు చేసి అమ్మడం పెద్ద లాభదాయకంగా లేదని ఫోర్డ్ భావించింది.

అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పట్ల మెహ్రోత్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఫోర్డ్ ఇండియాకు రాజీనామా చేసినట్లు సమాచారం.
Go Back to Shorts
India

More Telugu News