పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన టాలీవుడ్ అగ్రనిర్మాతలు.. సమస్యలపై చర్చలు

01-10-2021 Fri 14:09
  • పవన్ తో దిల్ రాజు, దానయ్య తదితరుల భేటీ
  •  సానుకూల వాతావరణంలో చర్చ
  • ఇటీవల తెలుగు సినిమా రంగ సమస్యలపై పవన్ ధ్వజం
  • ఏపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహావేశాలు
Tollywood producers met Pawan Kalyan

ఇటీవల టాలీవుడ్ సమస్యలకు సంబంధించి జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ విమర్శల దాడి అనంతరం టాలీవుడ్ నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు యువ హీరోలు పవన్ కు మద్దతు పలకగా, పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నేడు పవన్ కల్యాణ్ ను కలిశారు. దిల్ రాజు, డీవీవీ దానయ్య, వంశీ రెడ్డి, నవీన్ ఎర్నేని, సునీల్ నారంగ్, బన్నీ వాసు నేడు పవన్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు, సమస్యలపై వారు పవన్ తో చర్చించారు. సుహృద్భావపూరిత వాతావరణంలో ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.