Posani Krishna Murali: నీ నవరసాలు తాడేపల్లిలో చూపించుకో: పోసానిపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి మండిపాటు

Posani show your talent in Tadepalli says TDP SC cell
  • పవన్ పై పోసాని వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారు
  • జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గు పడాలి
  • సంస్కారం గురించి మాట్లాడే అర్హత పోసానికి లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ ను ఏమైనా అంటే ఊరుకోబోనంటూ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోసానిపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు మండిపడ్డారు.

మీడియాతో రాజు మాట్లాడుతూ, పవన్ పై పోసాని చేసిన వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి పోసాని సిగ్గుపడాలని అన్నారు. తన నవరసాలను పోసాని తాడేపల్లిలో చూపించుకోవాలని చెప్పారు.

ఆడవాళ్ల గురించి పోసాని అసభ్యంగా మాట్లాడారని... ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సంస్కారం గురించి మాట్లాడే అర్హత పోసానికి లేదని అన్నారు. పోసానికి కొడాలి నాని, ధర్మాన, ఎమ్మెల్యే ద్వారంపూడి సంస్కారం నేర్పించగలరా? అని ఎద్దేవా చేశారు.
Posani Krishna Murali
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP
TDP SC Cell

More Telugu News