ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఈసెట్, ఐసెట్ ఫలితాల విడుద‌ల

01-10-2021 Fri 12:40
  • ఈసెట్‌ ఫలితాల్లో 92.53 శాతం
  • ఐసెట్‌ ఫలితాల్లో 91.27 శాతం మంది ఉత్తీర్ణత
  • త్వరలోనే లాసెట్, ఎడ్‌సెట్ ఫలితాలు
icet results releases

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఈసెట్, ఐసెట్ ఫలితాలు విడుద‌లయ్యాయి. ఈసెట్‌ ఫలితాల్లో 92.53 శాతం మంది, ఐసెట్‌ ఫలితాల్లో 91.27 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్ల‌డించారు. త్వరలోనే లాసెట్, ఎడ్‌సెట్ ఫలితాలను కూడా విడుదల చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

ఏపీలో పీజీసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని విశ్వ‌విద్యాల‌యాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు అవకాశం క‌ల్పిస్తామ‌ని ఆదిమూలపు సురేశ్  తెలిపారు. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని తెలిపారు. కాగా, తెలంగాణ‌లోనూ టీఎస్‌సీపీఈటీ ద్వారా రాష్ట్రంలోని అన్ని వ‌ర్సిటీల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తోన్న విష‌యం తెలిసిందే.