Huzurabad: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ షురూ

Huzurabad Bypoll niotification releases
  • నామినేషన్ కేంద్రంలో క‌రోనా నిబంధనలు
  • లోప‌లికి నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి
  • కేంద్రం వద్ద 144 సెక్షన్,  రెండు అంచెల భద్రత

తెలంగాణ‌లో రాజ‌కీయ కాక రేపుతోన్న హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇటీవ‌లే షెడ్యూల్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. దాని ప్ర‌కారం ఈ రోజు ఉప ఎన్నిక‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని హుజూరాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి వివ‌రించారు. నామినేషన్ కేంద్రంలో క‌రోనా నిబంధనలు అమల్లో ఉంటాయ‌ని చెప్పారు. లోప‌లికి నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంద‌ని తెలిపారు.

ఆ కేంద్రం వద్ద 144 సెక్షన్,  రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశార‌ని వివ‌రించారు. మ‌ధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీక‌రిస్తారు. ఈ నెల 8 వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది.  నామినేషన్ల ఉపసంహరణకు  అక్టోబర్ 13 వ‌ర‌కు గ‌డువు ఉంది.  ఈ నెల 30న  పోలింగ్‌, వ‌చ్చేనెల‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటాయి. 

  • Loading...

More Telugu News