Bandi Sanjay: సీఎం కేసీఆర్ గారూ, మీకు ఏదైనా శాపం ఉందా?: బండి సంజయ్
- కేసీఆర్‌కు బండి సంజయ్ మరో లేఖ
- ఏడేళ్ల పాలనలో రైతు కంట కన్నీరు
- కేసీఆర్ ఫాంహౌస్ పంట పన్నీరు
- కేసీఆర్‌కు ఎందుకు నిజం చెప్పరని ప్రశ్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరో లేఖ రాశారు. 'సీఎం కేసీఆర్ గారూ మీ ఏడేళ్ల పాలనలో రైతు కంట కన్నీరు.. మీ ఫాంహౌస్ పంట పన్నీరు' పేరిట ఆయన ఈ లేఖ రాశారు. 'కేసీఆర్ సారు మీకు నిజం చెప్పకూడదన్న శాపం ఏమైనా ఉందా? ఏనాడు మీరు నిజాలు చెప్పారు? అందుకే అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా?' అని బండి సంజయ్ ప్రశ్నించారు.
'తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని మీరు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఏడేళ్ల కాలంలో ఏయే అసెంబ్లీ నియోజక వర్గాల్లో లక్ష ఎకరాలు సాగునీరు ఇచ్చారో మీరు వివరించగలరా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతూ పాలనను కొనసాగిస్తున్నారని ఆయన ఆ లేఖలో విమర్శించారు.