ఢిల్లీలో తెరుచుకున్న దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు

01-10-2021 Fri 11:43
  • ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్న ప్రభుత్వం
  • మేళాలు, స్టాళ్లు, ర్యాలీలకు అనుమతి లేదు
  • బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజా వేడుకలపై నిషేధం
Religious places in Delhi to reopen from today
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకున్నాయి. అయితే ప్రజలందరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కొన్ని నిబంధనలను విడుదల చేసింది. పండుగల సీజన్ కావడంతో కఠిన చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, డిప్యూటీ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే మేళాలు, ఫుడ్ స్టాళ్లు, ఝూలాలు, ర్యాలీలు, ఫెయిర్లకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజా వేడుకలపై నిషేధం ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఎవరికి వారు ఈ వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.