Allu Arjun: అల్లు రామ‌లింగ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ఆయ‌న‌ మ‌న‌వళ్లు

AlluRamalingaiah statue was unveiled by his grandsons
  • హైద‌రాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ఆవిష్క‌ర‌ణ‌
  • పాల్గొన్న బాబీ అల్లు, అల్లు అర్జున్, అల్లు శిరీష్
  • రామ‌లింగ‌య్య‌కు నివాళులు
అల్లు రామ‌లింగ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ఆయ‌న మ‌న‌వ‌ళ్లు బాబీ అల్లు, అల్లు అర్జున్, అల్లు శిరీష్ క‌లిసి అల్లు రామ‌లింగ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అల్లు రామ‌లింగ‌య్య‌కు నివాళులు అర్పించారు. ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కు అందించిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు.

అల్లు రామ లింగ‌య్య విగ్ర‌హం వ‌ద్ద వారు ఫొటోలు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో అల్లు కుటుంబ స‌భ్యులు, అల్లు స్టూడియోస్ సిబ్బందితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. కాగా, అల్లు రామ‌లింగ‌య్య కుమారుడు అల్లు అర‌వింద్ టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రిగా ఉన్న విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్, శిరీష్ టాలీవుడ్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 
   
         
Allu Arjun
Hyderabad
Tollywood

More Telugu News