Mahesh Babu: మళ్లీ ఇంతకాలానికి కెమెరా ముందుకు నమ్రత!

Mahesh Babu and Namratha new photo shoot
  • 'వంశీ' సినిమా సమయంలో లవ్
  • పెళ్లి తరువాత సినిమాలు మానేసిన నమ్రత
  • మహేశ్ సినిమా వ్యవహారాలపై దృష్టి
  • మ్యాగజైన్ ఫొటో షూట్ లో మెరిసిన జంట  
మహేశ్ బాబు .. నమ్రత కలిసి 20 ఏళ్ల క్రితం 'వంశీ' సినిమాలో నాయకా నాయికలుగా నటించారు. ఈ సినిమా షూటింగు సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వివాహమైన తరువాత నమ్రత నటనకు బై చెప్పేసి, మహేశ్ సినిమాలకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటోంది. ఆయన సినిమా ఓపెనింగ్స్ .. వేడుకల సమయంలో మాత్రమే ఆమె బయట కనిపిస్తుంటారు.  

అలాంటి నమ్రత చాలా కాలం తరువాత మళ్లీ మహేశ్ బాబుతో కలిసి కెమెరా ముందుకు వచ్చారు. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్ నిమిత్తం ఇద్దరూ కలిసి పోజులు ఇచ్చారు. ఇద్దరూ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తూ, అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. అందుకు సంబంధించిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. జనవరి 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత సినిమాగా లైన్లో రాజమౌళి ప్రాజెక్టు ఉందనే సంగతి తెలిసిందే..
Mahesh Babu
Namratha
Tollywood

More Telugu News