వైసీపీ ప్ర‌భుత్వం తిట్ల దండ‌కంతోనే స‌రిపెడుతోంది: సోము వీర్రాజు

01-10-2021 Fri 10:04
  • కేంద్ర స‌ర్కారు నిధుల‌తో ప‌నులు
  • చెత్త సేక‌ర‌ణ‌ వాహ‌నాల‌పై వైసీపీ రంగులు
  • అభివృద్ధి అంశాల‌న్నీ ప‌క్క‌న‌పెట్టారు
somu veerraju slams on ycp
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. ఈ రోజు అమ‌రావ‌తిలో చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌ను ప‌రిశీలించిన ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... వాహ‌నాల‌పై సీఎం వైసీపీ రంగులు, జ‌గ‌న్ పేరుతో స్టిక్క‌రింగ్ వేయించుకున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి నిధులు వ‌స్తున్నాయ‌ని, ఆ నిధుల‌ను వాడుకుంటూ రాష్ట్ర ప్ర‌భుత్వ నిధులు వాడుకుంటున్న‌ట్లు వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఫొటో లేకుండా వాహ‌నాల‌ను ఎలా ప్రారంభిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంశాన్ని ప‌క్క‌న పెట్టేసిన వైసీపీ... తిట్ల దండ‌కంతోనే స‌రిపెడుతోంద‌ని ఆయ‌న చెప్పారు.