బయోబబుల్‌తో విసిగిపోయిన క్రిస్‌గేల్.. ఐపీఎల్‌కు రాంరాం!

01-10-2021 Fri 08:05
  • కరీబియన్ లీగ్ నుంచి నేరుగా యూఏఈ వచ్చేసిన గేల్
  • సుదీర్ఘకాలం బయోబబుల్‌లో గడిపిన యూనివర్స్ బాస్
  • టీ20 ప్రపంచ కప్ కోసం మానసికంగా సిద్ధమయ్యేందుకే వెళ్తున్నానన్న గేల్
 Chris Gayle Pulls Out Of IPL 2021 Due To Bubble Fatigue

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ త్వరలోనే ఇంటిముఖం పట్టనున్నాడు. బయోబబుల్‌తో విసిగిపోయిన గేల్ ఐపీఎల్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్‌ కోసం యూఏఈలో అడుగుపెట్టడానికి ముందు గేల్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. అక్కడి నుంచి నేరుగా ఐపీఎల్‌కు వచ్చేశాడు.

సుదీర్ఘకాలం బయోబబుల్‌లో గడపడంతో విసిగిపోయిన గేల్ ఐపీఎల్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. కాగా, గేల్ యూఏఈలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రెండింట్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. తాను కొన్ని నెలలుగా బయోబబుల్‌లో ఉంటున్నానని, టీ20 ప్రపంచ కప్ కోసం మానసికంగా సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గేల్ తెలిపాడు.