సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

01-10-2021 Fri 07:36
  • అలియా 'గంగూభాయ్' రిలీజ్ డేట్ 
  • క్రిస్మస్ కు రానున్న 'ఆచార్య'
  • ఓటీటీ ద్వారా జ్యోతిక సినిమా    
Alia Bhat latest movie Gangubhai Kathiawadi gets release date

*  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ తాజాగా నటిస్తున్న హిందీ చిత్రం 'గంగూభాయ్ కతియావాడి'. ముంబై రెడ్ లైట్ ఏరియాలో చక్రం తిప్పిన మహిళగా ఇందులో అలియా నటించింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
*  మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆచార్య' చిత్రం రిలీజ్ విషయంలో మేకర్స్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్, చరణ్ సరసన పూజ హెగ్డే జంటలుగా నటించారు.
*  ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం 'ఉడన్పిరప్పే'. ఇందులో తంజావూరుకు చెందిన సాహస మహిళగా జ్యోతిక విభిన్న తరహా పాత్రలో నటించింది. ఈ నెల 14న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేస్తున్నారు. తెలుగులో దీనిని 'రక్తసంబంధం' పేరిట అనువదించారు. తెలుగు వెర్షన్ కూడా అదే రోజున విడుదలవుతుంది.