జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

01-10-2021 Fri 06:52
  • షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో ఎన్‌కౌంటర్
  • భద్రతా దళాలపైకి ఉగ్రవాదుల కాల్పులు
  • కొనసాగుతున్న ఆపరేషన్
 Terrorist killed in encounter in Shopian operation underway

జమ్మూకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు తొలుత కాల్పులు ప్రారంభించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్టు చెప్పారు. దర్యాప్తు అనంతరం ఉగ్రవాది వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.