Stalin: అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన స్టాలిన్

Stalin surprise visit to police station
  • సంచలన నిర్ణయాలతో ఆకట్టుకుంటున్న స్టాలిన్
  • చెన్నైలోని పోలీస్ స్టేషన్లో రికార్డుల పరిశీలన 
  • కేసులను పరిష్కరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్న వైనం

పాలనలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనదైన ముద్ర వేస్తున్నారు. సీఎం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు అర్ధరాత్రి సమయంలో చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించారు.

రాత్రి పూట సాక్షాత్తు ముఖ్యమంత్రి రావడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. స్టేషన్ ను ఎప్పుడు నిర్మించారు, కేసుల వివరాలు, వాటిని పరిష్కరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మరోపక్క, అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా స్టాలిన్ యథావిధిగా కొనసాగిస్తున్నారు. పేర్లను, జయలలిత ఫొటోలను కూడా ఆయన తొలగించలేదు. ఇది అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News