Bigg Boss-5: లహరి ఎలిమినేషన్ పై బిగ్ బాస్-2 విజేత కౌశల్ స్పందన

Bigg Boss season two winner Kaushal opines on Lahari elimiation
  • బిగ్ బాస్-5 నుంచి లహరి ఎలిమినేషన్
  • అన్యాయమని పేర్కొన్న కౌశల్
  • ఆమె ప్రవర్తన తనను ఆకట్టుకుందని వెల్లడి
  • 'లహరి కమ్ బ్యాక్' అంటూ హ్యాష్ ట్యాగ్

బిగ్ బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే, గతవారం నటి లహరి షారి ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. దీనిపై బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ స్పందించాడు. లహరిని బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ చేయడం బాగా లేదని విమర్శించాడు. ఈ నిర్ణయం అన్యాయం అనిపించిందని పేర్కొన్నారు. బిగ్ బాస్ ఇంట్లో లహరి ప్రవర్తన తనను బాగా ఆకట్టుకుందని, అయితే చాలా త్వరగా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

లహరి మరోసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. 'లహరి కమ్ బ్యాక్' అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా తన పోస్టుకు పొందుపరిచారు.

  • Loading...

More Telugu News