మాజీ సైనికుల సమస్యలపై.. రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాసిన సోము వీర్రాజు

30-09-2021 Thu 15:47
  • ఏపీలో మాజీ సైనికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి
  • విజయవాడలో ఆర్మీ బెటాలియన్ హెడ్ క్వార్టర్ ను ఏర్పాటు చేయండి
  • మాజీ సైనికులకు టోల్ గేట్ రాయితీని వర్తింపజేయండి
Somu Veerraju writes letter to Raj Nath Singh

కేంద్ర రక్షణశాఖ మంత్రికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలోని మాజీ సైనికుల సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. విజయవాడలో ఆర్మీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరే ఏపీలో కూడా మాజీ సైనికుల వాహనాలకు టోల్ గేట్ రాయితీని వర్తింపచేయాలని విన్నవించారు. మిలిటరీ డిస్పెన్సరీల్లో ఫార్మసీ సౌకర్యాన్ని మెరుగు పరచాలని రక్షణ మంత్రిని కోరారు.