Andhra Pradesh: బద్వేల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ సమావేశం

  • పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ
  • వచ్చే నెల 30న ఉప ఎన్నిక
  • వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా దాసరి సుధ
YS Jagan meets YSRCP Leaders On Badvel By Poll

బద్వేల్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీ నేతలతో చర్చించారు. ఇవాళ ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కడప జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.

బద్వేల్ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మంగళవారమే ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 30న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 8 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 2న ఫలితాన్ని వెల్లడిస్తారు. కాగా, టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

More Telugu News