జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలంటూ చైతూ పోస్ట్

30-09-2021 Thu 13:16
  • ‘లవ్ స్టోరీ’ టీమ్ తో గ్రూప్ ఫొటో ట్వీట్
  • హిట్ సినిమాను అందించినందుకు టీమ్ కు ధన్యవాదాలు
  • థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ‘లవ్ స్టోరీ’
Chaitu Posted A Group Photo With Team Love Story
‘లవ్ స్టోరీ’ ఇచ్చిన సక్సెస్ తో నాగ చైతన్య మంచి జోష్ మీదున్నాడు. రేవంత్ అనే మధ్య తరగతి కుర్రాడి పాత్రలో జుంబా మాస్టర్ గా ఒదిగిపోయాడు. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్న అమ్మాయిగా సాయి పల్లవి నటించింది. కుల వ్యవస్థపై సున్నితమైన అంశాలతో శేఖర్ కమ్ముల సినిమాను చక్కగా తెరకెక్కించాడు.


సినిమా సక్సెస్ సందర్భంగా చైతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంత మంచి హిట్ సినిమాను అందించిన టీమ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. జీవితాంతం గుర్తుంచుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ‘లవ్ స్టోరీ’ అందించిందని ఆనందం వ్యక్తం చేసిన చై.. టీమ్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.