Balka Suman: సానుభూతి కోసం ఈటల డ్రామాలు చేసే అవకాశం ఉంది: బాల్క సుమన్

Etela Rajender may play dramas says Balka Suman
  • ఈటల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి
  • దివ్యాంగుల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
  • దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తాం
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రజల సానుభూతి పొందేందుకు ఈటల రాజేందర్ డ్రామాలు చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈటల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో జరిగిన వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల గురించి గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో దివ్యాంగులందరికీ పెన్షన్ అందుతోందని చెప్పారు. దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
Balka Suman
TRS
Etela Rajender
BJP

More Telugu News