Vijay: విజయ్ కోసం కియారా అద్వానిని ఎంపిక చేసిన వంశీ పైడిపల్లి!

  • తెలుగులో చేసింది రెండు సినిమాలు 
  • బాలీవుడ్లో వరుస అవకాశాలు 
  • విజయ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా
Vamsi Paidipalli movie update

బాలీవుడ్ భామల్లో ఇప్పుడు బిజీగా ఉన్న కథానాయికలలో .. అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న కథానాయికలలో కియారా అద్వాని ఒకరుగా కనిపిస్తుంది. అందాల చందమామలా కనిపించే ఈ సుందరికి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందువల్లనే ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి.

కియారా అద్వాని తెలుగులో ఇంతకుముందు 'భరత్ అనే నేను' .. ' వినయ విధేయ రామ' సినిమాలు చేసింది. అలాంటి ఈ బ్యూటీని ఇప్పుడు తన సినిమా కోసం వంశీ పైడిపల్లి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఆయన ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

'మహర్షి' తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి భావించాడు కానీ కుదరలేదు. ఆ కథను విజయ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం కియారా భారీ పారితోషికం తీసుకుంటోందని అంటున్నారు. 'బీస్ట్' తరువాత విజయ్ చేయనున్న సినిమా ఇదేనట!

More Telugu News