'పుష్ప' ఫస్టు పార్టు విలన్ గా సునీల్!

30-09-2021 Thu 10:41
  • రెండు భాగాలుగా రానున్న 'పుష్ప'
  • ఫస్టు పార్టు షూటింగ్ 90 శాతం పూర్తి
  • మిగతా షూటింగ్ పూర్తిచేసే పనిలో టీమ్
  • హాట్ టాపిక్ గా మారిన సునీల్ పాత్ర      
Sunil in Pushpa movie
సుకుమార్ దర్శకుడిగా రూపొందుతున్న 'పుష్ప' సినిమా సెట్స్ పై ఉంది. అల్లు అర్జున్ - రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాను, రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్టు పార్టుకు సంబంధించి 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన 10 శాతం చిత్రీకరణను పూర్తిచేసే పనిలో ఉన్నారు.

ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. ఆయన ఫస్టులుక్ వదలడం .. విపరీతమైన రెస్పాన్స్ రావడం కూడా జరిగిపోయింది. అయితే ఆయన ఫస్టు పార్టు చివరలో, కథ పతాకస్థాయికి చేరుకుంటున్న సమయంలో తెరపై ప్రత్యక్షమవుతాడట.

అలా ఆయన ఎంట్రీతో ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించి, సెకండ్ పార్టు కోసం వెయిట్ చేసేలా చేస్తారని చెప్పుకుంటున్నారు. అయితే మరి ఫస్టు పార్టు అంతా కూడా విలన్ లేకుండానే కథ నడుస్తుందా? అంటే, అలాంటి పప్పులేం ఉడకవంటున్నాడు సునీల్. ఎందుకంటే ఫస్టు పార్టులో విలన్ ఆయనేనట. తాజాగా బయటికి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.